కమ్మర్ పల్లి లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో శుక్రవారం  స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ  పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్  ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి  తిరుగుతూ  పరిసరాలను,  నీటి నిల్వ గుంతలను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్  మాట్లాడుతూ  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాడైన వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పాడైన వస్తువులలో ఎక్కువ రోజుల నుండి మీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటింటికి మరుగు దొడ్డి నిర్మించుకొని వాడుకోవాలన్నారు.పలు కాలనీలలో రోడ్డు వెంట పెరిగిన పిచ్చి మొక్కలను, చెత్తా చెదారాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది చేత తొలగింపజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శాంతి కు