
తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన ఉయ్యాల ఉప్పలమ్మ భర్త ఇటీవల గుండె పోటుతో మరణించడం జరిగింది. ఆమెతో కలిసి బండమీది చందుపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2005 10వ తరగతి చదివిన మిత్రులందరు ఆమె కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గునగంటి లింగస్వామి, పొడిశెట్టి శ్రీనాధ్, గుండు దుర్గ స్వామి, సుద్దగాని శ్రీకాంత్, దశరథ తదితరులు పాల్గొన్నారు.