నవతెలంగాణ – రాయపర్తి : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని ఎస్సై దేశిని విజయ్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని కేశవపురం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా ఎస్సై ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నమెంటును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఆటలు నిర్వహించుకోవాలని తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది అన్నారు. గ్రామీణ ప్రాంత యువకులు క్రీడల్లో రాణిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిదుముల ఎల్లమ్మ యాకయ్య, బియస్పి పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జి చిలుముల్ల క్రిష్ణ, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గుజె సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మొలుగిరి పున్నమయ్య, టోర్నమెంట్ నిర్వాహకులు చిలుముల్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.