స్నేహం ఒక తీయని జ్ఞాపకం

స్Friendship is a lasting memoryనేహం,
ఒక తీయని జ్ఞాపకాన్ని ఇచ్చావు
మరపురాని ఆనందం ఇచ్చావు
ప్రేమానురాగం పంచావు
వర్ణించలేని బంధమైనావు
స్నేహం నా జీవితంలో మధురమైన పుస్తకం
నాకు ప్రేమను పంచే కుసుమం
బాధలో ఇచ్చావు ధైర్యం
కష్టంలో అందించావు సాయం
నా జీవితాన్ని చేశావు రంగులమయం
నీతో వుంటే నాకు తెలియదు లోకం
నా మదిలో కురిపించావు సంతోషాల వర్షం
స్నేహం అందించావు వింతైన అనుభవం
స్నేహం నువ్వు నాకు ఎంతో ఆదర్శమైన అనుబంధం
– పి.యుక్తిక,
10వ తరగతి, అరవింద మోడల్‌ హైస్కూల్‌