– స్వచ్ఛతే స్నేహానికి గీటురాయి
ఘనంగా స్నేహితుల దినోత్సవం
నవతెలంగాణ – మల్హర్ రావు
స్నేహం.. కల్లకపటం తెలియని వయసులో మొదలైనా.. బాల్య వయసులో మొదలైనా.. స్నేహితుడికి ఆపద వస్తే ముందుండేది. ఎందరు ఉన్నా ఏ సమస్య వచ్చిన చెప్పుకునేందుకు ఓ స్నేహితుడు ఉంటే చాలు అన్ని మరిచిపోతాం. అంత గొప్పది స్నేహం. ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నవ తెలంగాణతో నాటి 1990-91 5వ తరగతి బ్యాచ్ బాల్య మిత్రులు,1996-97 10వ తరగతి పూర్వ విద్యార్థులతో చర్చావేదికలో భాగంగా. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఎప్పటికీ స్నేహబంధమే శాశ్వతమన్నారు. స్నేహితులతో ఉంటే ఏదైనా సాధించగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పలువురు పూర్వ విద్యార్థులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే…
వ్యక్తిత్వం మెరుగుపరిచేలా ఉండాలి: చింతల కుమార్ యాదవ్
స్నేహం ఒకరి ఎదుగుదలకు మరొకరు కృషిచేసేలా ఉండాలి. మనుషులుగా వేరు ఉన్నప్పటికీ ఆలోచన విధానాలు ఒకేలా ఉండే వ్యక్తుల మధ్య స్నేహం చిరకాలం ఉంటుంది..
అరమరికలు ఉండొద్దు: కల్వల మహేందర్
స్నేహితుల మధ్య అరమరికలు ఉండకూడదు. కొన్ని సార్లు గోప్యత అవసరమే. స్నేహితుల్లో ఒకర పొరపాట్లు చేస్తుంటే తెలిసి కూడా హెచ్చరించకపోతే వారికే నష్టం. తప్పులు జరిగినప్పుడు హెచ్చరిం చే వాళ్లే నిజమైన మిత్రులు.
మన కోసం ఆలోచించేవారు బెటర్: భూషనవేన సమ్మయ్య
మన కోసం ఆలోచించేవారు బెటర్: భూషనవేన సమ్మయ్య
స్వచ్ఛమైన స్నేహం ఎదుటి వాళ్లు బాగుం డాలని ఆరాటపడుతుంది. అభివృద్ధి చెందితే సంతోషిస్తుంది. కష్టంలో తోడు ఉం డడం, ఆనందాల్లో హుందాగా ఉండడం వంటి ఉన్నతమైన లక్షణాలు ఉన్న వాళ్లను స్నేహితులుగా ఎంచుకోవాలి.
అభివృద్ధిని కోరుకునే వాళ్లే స్నేహితులు: దేవనంది సదయ్య
అభివృద్ధిని కోరుకునే వాళ్లే నిజమైన స్నేహితులు. ప్రోగ్రెసివ్ కమ్యూనికేషన్ ఇద్దరికీ మేలు చేస్తుంది. పరస్పరం అభివృ ద్ధిని కోరుకునే వ్యక్తుల మధ్య స్నేహం చిరకాలం నిలబడుతుంది.
స్నేహం అమూల్యమైంది: నర్ల శ్రీనివాస్ (అలియాసిస్ ఐస్)
స్నేహం అనేది అమూల్యమైనది. ఈ రోజుల్లో మంచి స్నేహితులు అంత సులభంగా దొరకరు. మంచి స్నేహితు లను దూరం చేసుకుంటే మళ్లీ దొరకరు. అంత అపురూపమైనదై ఉండాలి. కొను క్కున్నా, కోల్పోయినా తిరిగి దొరకనంత గొప్పది స్నేహం.
అమ్మానాన్నలే అసలైన స్నేహితులు: బి.భూమయ్య
లైఫ్ లో ఎవరికైనా సరే ఎదగాలనే కోరిక ఉంటుంది. మనం బాగుపడితే చూసి సం తోషించగలిగే స్నేహితులు అవసరమే. పిల్లలు బాగుపడాలని కోరుకునే వాళ్లలో అమ్మానాన్నలను మించిన వాళ్లు ఇంకె వరూ ఉండరని నా ఉద్దేశ్యం. కాబట్టి తల్లిదండ్రులే నిజమైన స్నేహితులు.
మంచి స్నేహాలు నిలుస్తాయి: ఆడిచెర్ల శ్రీనివాస్
మంచి స్నేహాలు కలకలం నిలిచి ఉంటాయి. స్నేహితులను జాగ్ర జాగ్రత్తగా ఎంచుకోవాలి. అన్ని కోణాల్లో ఆలోచించాకే ఆత్మీయులుగా భావించాలి.