స్నేహ మెంత మధురం

Friendship is sweetమాటలలో వర్ణించ తరం కానిది స్నేహం
ఒంటరితనంలో నేనున్నానని భరోసా యిచ్చేది
మనలోని ఒప్పులను మెచ్చుకుంటూ
తప్పులను సరిచేసేది
కానీ అలాంటి స్నేహాలు కొన్ని
దూరం అయిపోతున్నారు
అపోహలు – అపార్ధాలు అనుమానాలతో

కొన్ని పరిచయాలు అంతమైపోతున్నారు
సంభాషణలు –
సత్ప్రవర్తన లేకపోవడంతో

కొన్ని స్నేహాలు సమాధి అయిపోతున్నారు
జెలసి – ఈర్ష్య – ఇగోలతో

కొన్ని బంధాలు తెగిపోతున్నారు
సమన్వయం – సర్దుబాటు లేకపోవడంతో

కొన్ని స్నేహాలు
విడిపోతున్నారు నమ్మకం – అభిమానం ఆత్మీయత లేక

కొన్ని నమ్మకాలు సమాధి అయిపోతున్నారు
చెప్పుడు మాటలు -చెడు చేష్టలతో
కొన్ని వాస్తవాలు కనుమరుగైపోతున్నారు

అవాస్తవాల ఆధిపత్యం పోరులతో
ఎన్నో మనసులు గాయపడుతున్నారు
మన అనాలోచిత –

కాబట్టి మీ మనసుల్లో
అభిమానాన్ని ఆవిరి కానీయకండి
స్నేహ మాధుర్యాన్ని మరవకండి.

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
– అనిత దావాత్‌, 9394221927