నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మన సంస్కృతి, సాంప్రదాయాలైన సాముహిక వనభోజనాలతో పరస్పర స్నేహ భావం పెరుగుతుందని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట డిపో ఆవరణలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి సి సజ్జనార్ సూచన మేరకు “కార్తీక మాసం వనభోజనాల” కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు మరియు వారి జీవిత భాగస్వాములకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ అసిస్టెంట్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ ,గ్యారేజి ఇంచార్జ్ హనుమా నాయక్, ముత్యాలు, మనోజ్ కుమార్, జాకబ్, శ్రీనివాస్ , డిపో ఉద్యోగులు వారి జీవిత భాగస్వాములు పాల్గొన్నారు.