– టీఎస్‌ఎస్‌యూఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నట్టు తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం(టీఎస్‌ఎస్‌యూఎస్) రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య , కార్యనిర్వాహక అధ్యక్షులు అనిల్ చారి, కోశాధికారి దుర్గం శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. పెన్ డౌన్, చాక్ డౌన్ తో కేజీబీవీ,యూఆర్‌ఎస్, భవిత సెంటర్ల లో బోధన ఆగనున్నదని పేర్కొన్నారు. సమ్మెలో జిల్లా విద్యా, మండల విద్యా శాఖ కార్యాలయాల సిబ్బందితో పాటు క్లస్టర్ పాఠశాలల సిబ్బంది, ఉన్నత పాఠశాలలోని ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్ సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు.