ఈనెల 21 నుండి 24 వరకు ప్రజా పాలన గ్రామసభలు: ఎంపీడీవో, ఎంపీఓ

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లి, మండలాల పరిధిలోగల మొత్తం 34 గ్రామ పంచాయతీల పరిధిలో ఈనెల 21 నుండి 24వ తేదీ వరకు ప్రజా పాలన గ్రామసభలు జరుగుతాయని మండల అభివృద్ధి అధికారి రాణి మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య సోమవారం ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుండి నాలుగు రకాల పథకాలు ప్రజలకు అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసేందుకు ఈ గ్రామసభల ద్వారా ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు తెలిపారు. తేదీల వారీగా గ్రామపంచాయతీల పరిధిలో జరిగే గ్రామసభల్లో ప్రజలు పాల్గొనాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.