ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన మోకిన పెళ్లి మహేందర్ జూనియర్ అసిస్టెంట్ కొలువు సాధించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 4 ఫలితాలలో గిరిజన సహకార కార్పొరేషన్ లో జూనియర్ అసిస్టెంట్ గా నియమితులయ్యారు. ఇచ్చోడ మైనారిటీ గురుకుల పాఠశాలలో సైన్స్ విభాగంలో పొరుగు సేవా సిబ్బందిలో టీజీటీ సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్ 4 ఫలితాలలో ప్రభుత్వ ఉద్యోగిగా నియమించడం పట్ల ఆయన స్నేహితులు ఇజ్జగిరి నవీన్ కుమార్, మోకిరాల మహేష్, ఏం. అశోక్, ఎన్. ప్రమోద్, పులిపాక నరేష్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.