సాయి బాబా ఆలయం నుండి నెమలి సాయిబాబా వరకు పాదయాత్ర

నవతెలంగాణ – మద్నూర్
సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం చేపట్టే భక్తుల పాదయాత్ర ఆదివారం నాడు మద్నూర్ శ్రీ సాయిబాబా ఆలయం నుండి నెమలి శ్రీ సాయిబాబా ఆలయం వరకు భారీ సంఖ్యలో భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్ర ప్రారంభోత్సవంలో శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు భారీగా తరలి వెళ్లారు.