అన్న మీద ప్రేమతో రాజధాని నగరం నుంచి..

నవతెలంగాణ – ఆళ్ళపల్లి : భారతదేశంలో రాఖీ పండుగకు ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ విదితమే. సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఈ రక్షాబంధన్ పండుగ రోజున అన్నా – చెల్లలు ప్రపంచంలో ఎవరు ఎక్కడ స్థిరపడ్డా గాని రాఖీ పండుగ వచ్చిందంటే వెతుక్కుంటూ అక్కా లేదా చెల్లెలు వచ్చి మరీ అన్న లేదా తమ్ముడుకి రాఖీ కట్టి తమ ప్రేమను చాటుతారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. అచ్చం అలాంటి ఘటనే ఆళ్ళపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో జరిగింది. సోమవారం రాఖీ పండుగ కావడంతో.. హైదరాబాద్ లో ఉంటున్న రాజ్యలక్ష్మి అనే గృహిణి అన్నకు రాఖీ  కట్టడానికి సుదూర ప్రయాణం చేసి మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో నివసిస్తున్న తాళ్లపల్లి శేఖర్ ఇంటికి వచ్చి రాఖీ కట్టింది.