ఈనెల 11న జరిగిన తెలుగు చలనచిత్ర దర్శకుల ఎన్నికలలో దర్శకుడు వీరశంకర్ ప్యానెల్ సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికైన నూతన కార్యవర్గం శుక్రవారం రథసప్తమి పర్వదినాన దర్శకుల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడు తూ,’మా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా, గెలిచిన క్షణం నుండే కార్యాచరణను ప్రారం భించాం. మా సభ్యులు మాకిచ్చిన అతికొద్ది కాలంలోనే మా సంఘాన్ని టిఎఫ్‌డిఎ 2.0గా తీర్చిదిద్దుతాం’ అని తెలిపారు.