రేపటి నుంచి సెర్చ్‌ కమిటీల భేటీ కొత్త వీసీల

– నియామకంపై కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో విశ్వవిద్యాలయల ఉప కులపతుల (వీసీ) నియామకం ప్రక్రియకు సంబంధించి గురువారం నుంచి సెర్చ్‌ కమిటీల సమావేశాలు ప్రారంభం కాను న్నాయి. శుక్ర, శనివారాల్లోనూ ఈ భేటీలు జరుగుతాయని విశ్వసనీయంగా తెలి సింది. కొన్ని విశ్వవిద్యాలయాలకు సంబం ధించిన సెర్చ్‌ కమిటీల సభ్యులు విదేశాల్లో ఉన్నారని సమాచారం. అందులో కొందరు వర్చువల్‌గా పాల్గొనే అవకాశమున్నది. మరి కొన్ని వర్సిటీల సెర్చ్‌ కమిటీ సభ్యులు నేరుగా పాల్గొనేందుకు వీలు కాదని సమా చారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో సెర్చ్‌ కమిటీల భేటీలు ఆలస్యమయ్యే అవకాశ మున్నది.
జేఎన్‌ఏఎఫ్‌ ఏయూతో పాటు మరో విశ్వ విద్యాలయం సెర్చ్‌ కమిటీల భేటీ తేదీల్లో మార్పు ఉండనుంది. వాటి భేటీ ఖరారయ్యాక రాష్ట్రంలో పది విశ్వ విద్యాలయాల వీసీలకు సంబంధించి ముగ్గురు పేర్ల ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వానికి సెర్చ్‌ కమిటీలు సిఫారసు చేస్తాయి. వాటిని న్యాయశాఖ పరిశీలించి న తర్వాత గవర్నర్‌ ఆమోదానికి ప్రభుత్వం పంపిస్తుంది. ముగ్గురు పేర్లలో ఒకరిని గవర్నర్‌ ఆమోదించిన తర్వాత వీసీల నియామకానికి ఉత్తర్వులు వెలువడతా యి. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడాని కి కొంత సమయం పట్టే అవకాశ మున్నది.
దసరా తర్వాతే వీసీల నియామకం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఇంకోవైపు వీసీల నియామకాల్లో సామా జిక తరగతుల వారీగా ప్రాధాన్యత ఇవ్వా లని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయి తే ఆశావహుల్లో ఆసక్తి నెలకొన్నది. ఎవరి స్థాయిలో వారు పైరవీలు జోరుగా చేస్తున్న ట్టు సమాచారం. ఢిల్లీ స్థాయిలో ఏఐసీసీ అగ్ర నాయకులను కొందరు ప్రొఫెసర్లు కలిసి వీసీ పదవులను ఇప్పించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. వీసీ పదవులు ఎవరిని వరిస్తాయో వేచి చూడాల్సిందే.