సాయి యాదాద్రి వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ..

– సామాజిక కార్యకర్త మన్నె నర్సింహారెడ్డి
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో సాయి యాదాద్రి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.గురువారం సంస్థాన్ నారాయణపురం మండలం గుడి మల్కాపురం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె నర్సింహారెడ్డి తండ్రి కీర్తిశేషులు పెద్దిరెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా గురువారం 50 మంది వృద్ధులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మన్నె నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏమి చేసినా తక్కువేననీ అన్నారు. తల్లిదండ్రులను దేవుళ్ళ కంటే ఎక్కువగా ఆరాధించాలని నర్సిరెడ్డి అన్నారు. మా తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటా అని మన్నె నరసింహారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మన్నె రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.