నవతెలంగాణ – జక్రాన్ పల్లి
అనాధాశ్రమంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు ఉమాజీ నరేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు జక్రాన్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు వినోద్ తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని అనాధాశ్రమం లోని పిల్లలందరికీ పనులు పంపిణీ చేసి వారి మధ్యనే కేక్ కట్ చేసి స్వీట్ అందజేసినట్టు జక్రాన్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు వినోద్ తెలిపారు. అనాధ పిల్లల మధ్య నిజాంబాద్ రూరల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు నరేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని వినోద్ తెలిపారు.