పండగ పూట ఆకాశాన్నింటిన పండ్ల ధరలు

నవతెలంగాణ – గాంధారి 

గాంధారి మండల కేంద్రంలో పండగ పూట పండ్ల ధరలు ఆకాశాన్ని అంటాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు ఉపవాస దీక్ష ఉండి సాయంత్రం పండ్లు పలాలతో ఉపవాస దీక్షను విరమిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని పండ్ల వ్యాపారులు సాధారణ రోజుల్లో కన్నా రెట్టింపు ధరలకు పండ్లను విక్రయించారు. పండ్లు కొనుగోలుకు ప్రజలు పండ్ల దుకాణాల దగ్గర విపరీతమైన జనం ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని పండ్ల వ్యాపారులు ధరలు అమాంతం పెంచేసి అందిన కాడికి దోచుకున్నారు. ధరలు అమాంతం పెంచడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.