ఆన్ లైన్ కొనుగోలులో ఆశాభంగం..

– ఫోన్ కు బదులుగా బెల్టు 
నవతెలంగాణ – నవీపేట్
ఆన్లైన్ షాపింగ్ అలవాటు పట్నాల నుండి పల్లెటూర్లకు సైతం పాకింది. దీంతో ఆన్లైన్ షాపింగ్ ల మోజుతో మండలంలోని శివతాండకు చెందిన మెగావత్ జీవన్ నాయక్ గత 15 రోజుల క్రితం ఆశా కలెక్షన్ పేరుతో గల ఆన్లైన్ లో రూ.5000  మొబైల్ ఫోన్ ఆర్డర్ ఇచ్చాడు. దీంతో పోస్టు ద్వారా మంగళవారం ఇంటికి రాగా రూ.5000 నగదు చెల్లించి ఆర్డర్ తీసుకొని తెరిచి చూడగా అందులో బెల్టు ఉండడంతో ఆశ భంగం కలిగింది. కూలినాలి చేసుకొని రూపాయి రూపాయి డబ్బులు జమ చేసుకుంటూ కష్టపడి సంపాదించిన సొమ్మును ఆన్లైన్ వ్యాపారస్తులు ఇలా దోచుకుంటున్నారు. కాబట్టి పోలీసు యంత్రాంగం ఇటువంటి ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు భావిస్తున్నారు.