
నీ ఆస్తీ అడుగుతున్నామా ముఖ్యమంత్రి కేసిఆర్ , అంగన్ వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్ల ను నెరవేర్చండని జుక్కల్ అంగన్ వాడి టీచర్లు, ఆయాలు పేర్కోన్నారు. ఆదివారం నాడు మండలంలోని యాబైరెండు అంగన్ వాడి టీచర్లు, ఆయాల నిరవదిక సమ్మే ఏడవ రోజుకు చేరుకుంది. వారం రోజులుగా వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభూత్వం పైన వ్యతిరేకంగా సమ్మే చేపట్టిన చీమకుట్టినట్టు లేదని టీచర్లు ఆభిప్రాయం వ్యక్తం పరిచారు. బిచ్కుందలోని ఎమ్మెలే ఇంటి ముట్టడి చేపట్టి కలిసి వినతి పత్రం అందించామని, కాంగ్రేస్ , ఇతర పార్టీల ఎమ్మెలే టికేట్ ఆశిస్తున్న ఆశావాహులు సమ్మే చేస్తున్న అభ్యర్థులు శిభిరాలకు సందర్శించి మద్దతు ప్రకటించారు. అయిన డిమాండ్ల పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. ఎంతకైన తెగించి తమ డిమాండ్లను ప్రభూత్వం దిగి వచ్చేదాకా పోరాటాలు చేస్తామని మండల టీచర్లు, ఆయాలు పేర్కోన్నారు. కార్యక్రమంలో టీచర్లు , ఆయాలు తదితరులు పాల్గోన్నారు.