నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పూర్తి సమాచారం

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని గత సంవత్సరం 2023 లో 767 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదుకాగా ఇందులో 337 మంది మరణించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. ఈ రోడ్డు ప్రమాదాలలో మద్యం త్రాగి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం త్రాగి నేరాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. మార్చ్ నెల – 2024 లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు మొత్తం 649 నమోదు చేసి ఇందులో జైలు శిక్ష 267 మందికి పడగా ఇందులో కొంత మందికి 10 రోజుల నుండి 14 రోజుల వరకు జైలు శిక్ష చాలా మందికి పడడం జరిగింది. కాబట్టి యువత మద్యం తాగి వాహనాలు నడుపరాదు అని పోలీస్ కళాబృందం ద్వారా అవగాహణ కార్యాక్రమాలు  ట్రాఫిక్ సిబ్బంది ద్వారా వివిధ కళాశాలలో విధ్యార్థులకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించడం జరగుతుంది. కావున జిల్లా ప్రజలు ఇట్టి విషయాన్ని క్షుణ్ణంగా గమనించి వాహనాలు నడిపే సమయంలో మద్యం సేవించి వాహనాలు నడువరాదు అని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలియజేశారు.