రైల్లో ప్రయాణిస్తున్న నిండు గర్భిణీ.. సుఖ ప్రసవం..

Pregnant woman traveling in train.. happy delivery..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రైలు ప్రయాణిస్తున్న నిండు గర్భిణీకి  సుఖ ప్రసవం చేసిన సంఘటన భువనగిరి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈఏంటి తెలిపిన వివరాల ప్రకారం  హీనా కటోన్ అనే నిండు గర్భిణి సికింద్రాబాద్ నుంచి గోరక్పూర్ ఎక్స్ప్రెస్ లో బీహార్ రాష్ట్రం పాట్నాకు ప్రయాణిస్తున్న క్రమంలో గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 కు సమాచారం అందించారు.  సమాచారం అందుకున్న యాదగిరిగుట్ట 108 అంబులెన్స్ భువనగిరి రైల్వే స్టేషన్లో  సంఘటన స్థలానికి చేరుకుని , వెంటనే స్పందించి అక్కడికి వెళ్లారు వెళ్లిన వెంటనే గర్భిణీ తీవ్రమైన పురిటి నొప్పులతో బాధపడుతూ ఉండడంతో ఈఎంటి విష్ణు మోహన్ రెడ్డి భువనగిరి రైల్వేస్టేషన్లో నిలిపివేసిన ట్రైన్ లోనే మూడవ కాన్పులో మహిళకు కాన్పు నిర్వహించినట్లు తెలిపారు. మూడో కాన్పులో హీనా కాటున్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచారు. వారికి  మెరుగైన ప్రధమ చికిత్స కోసం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తల్లి బిడ్డలు ఇద్దరిని తరలించారు. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు అక్కడ రైల్వే సిబ్బంది మరియు ప్రయాణికులు 108 సిబ్బంది కాన్పు నిర్వహించినందుకు ఈఎంటి  విష్ణు మోహన్ రెడ్డి కి మరియు పైలెట్ మహేష్ కు ప్రశంసించి అభినందనలు తెలిపారు. ప్రయాణికులు సంతోషం కూడా వ్యక్తం చేశారు.