– ఎల్లమ్మబండ ముదిరాజ్ సంఘం
నవతెలంగాణ-కూకట్‌పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ముదిరాజ్ సంఘం కార్యవర్గ సభ్యులు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కి సంపూర్ణ మద్దతు తెలియచేస్తూ.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి, వివేకానంద నగర్‌లోని ఆయన నివాసంలో ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని ముదిరాజ్ సంఘం సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ముది రాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ.. ముదిరాజ్‌ల ముద్దు బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌కి అన్ని విధాలుగా అండగా ఉండి, అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం అన్నా రు. బీసీల ఐక్యతను చాటుదాం అని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కానుకగా ఇస్తాం అని ముక్తకం ఠంతో పిలుపునిచ్చారు. మేము అంతా ఐక్యంగా ఉండి బీఆర్‌ఎస్ పార్టీ విధివిధానాలకు కట్టుబడి ఉంటాం అని, బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం కషి చేస్తాం అని పేర్కొ న్నారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి డివిజ న్‌ను అన్ని రంగాలలో అభివద్ధి చేశారని, అనేక అభివద్ది కార్యక్రమాలు చేపట్టి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా కషి చేశారని తెలిపారు. మంచి మనసున్న వ్యక్తి ఆరెకపూడి గాంధీ నేతత్వంలో, ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ని గెలిపించుకుంటాం అని ముదిరాజ్ సంఘం నాయకులు ముక్తకంఠంతో తెలియచేసారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే గాంధీ మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటిం చారు. ఏప్రిల్ 13 న చేవెళ్లలో జరిగే కేసీఆర్ భారీ బహిరంగ సభను సమిష్టి కషితో విజయవంత చేయాలని గాంధీ తెలియ చేసారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి, సమిష్టి కషి తో పని చేద్దాం అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జోగిపేట బాల్ రాజు, తెలంగాణ ముదిరాజ్ సంఘం ఎల్లమ్మ బండ సలహదారుడు శ్రీనివాస్, పాల్గొన్నారు.