ఎస్సీ వర్గీకరణకు తుడుం దెబ్బ పూర్తి మద్దతు

– వట్టం ఉపేందర్ తుడుం దెబ్బ రాష్ట అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ నిర్వహిస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ అన్నారు. సోమవారం మండలంలోని గ్రామంలో  కుమ్రం భీం విగ్రహం వద్ద  తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు  చింత కృష్ణ సభాద్యక్షతలో  వట్టo ఉపేందర్ మాట్లాడుతూఈనెల 7న రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో జరగబోవు లక్షల డప్పులు వేలాది గొంతులు సాంస్కృతిక  కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసి, ఆదివాసి ఉప తెగలు తుడుం దెబ్బ నేతృత్వంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని వట్టం  ఉపేందర్ తెలిపారు. దేశంలో అత్యంత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరించండి  ఆదేశాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల పేర్ల కాలయాపన చేస్తుందని  కాలయాపన తో జాప్యం చేయాలని చూస్తుందని జాప్యం పై షెడ్యూలు కులాలలోని షెడ్యూలు తెగలలోని అణగారిన బిడ్డలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పోరాటాలకు తలోగ్గిన రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ల ప్రకారంగా వర్గీకరణ న్యాయ సమ్మతం తేల్చి చెప్పినప్పటికీ కాలయాపన తో కల్లి బొల్లి మాటలతో కాలం వెళ్లదియాలని  రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ఇట్లాంటి చౌక బారు వేషాలు  మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  వట్టం  జనార్ధన్, తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రామణాల లక్ష్మయ్య,  ఎమ్మార్పీఎస్ ఆదివాసి సంఘాల రాష్ట్ర సమన్వయ కర్త పుట్ట రవిమాదిగ, తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బక శ్రావణ్ కుమార్,నాయక పోడ్ దెబ్బ ములుగు నియోజక వర్గ అధ్యక్షులు ఎర్నే ధనుంజయ్ నాయక పోడ్ తుడుం దెబ్బ అనుబంధ సంఘం ఆదివాసీ మహిళ సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమురం లక్ష్మి కాంత, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు  ఆదివాసి కో ఆర్డినేషన్  నాయకులు నెమలి నర్సయ్యమాదిగ,  ములుగు జిల్లా ప్రజా సంఘాల జెఎసి అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్ మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకులు  ఇరుగు పైడిమాదిగ,  ఆదివాసీ మహిళ సంఘం  రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ముర్రం ఈశ్వరమ్మ, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి  పూనెమ్ బాల కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు  దుగ్గరపు వీరభద్రమ్ మాహుబాద్ జిల్లా అధ్యక్షులు సువర్ణపాక వెంకట రత్నం  మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాం మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పూల్లూరి కర్ణాకర్ మాదిగ  తుడుం దెబ్బ జిల్లా ముఖ్య నాయకులు  ఈక  జగ్గారావు, పెండగట్ల బాలరాజు, వట్టo తదితరులు  వందలాది ఆదివాసీలు పాల్గొన్నారు.