ఎస్సీ వర్గీకరణకు బీసీ సంఘం పూర్తి మద్దతు

– వలస శ్రీనివాస్ బీసీ సంఘ రాష్ట్ర నాయకులు 
నవతెలంగాణ – తాడ్వాయి 
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ నిర్వహిస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి పూర్తి మద్దతు తెలిపినట్లు, పద్మశాలి సంఘం రాష్ట్ర నేత, బీసీ సంఘ రాష్ట్ర నాయకులు వలస శ్రీనివాస్ శుక్రవారం మండలంలో ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బీసీ రాష్ట్ర నాయకులు వలస శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 7న రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో జరగబోవు లక్షల డప్పులు వేలాది గొంతులు సాంస్కృతిక  కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘం నేతృత్వంలో పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలిపినట్లు తెలిపారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరించండి అని ఆదేశాలను కూడా జారీ చేసినప్పటికీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల పేర్ల కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కాలయాపన తో జాప్యం చేయాలని చూస్తుందని జాప్యం పై షెడ్యూలు కులాలలోని షెడ్యూలు తెగలలోని అణగారిన బిడ్డలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పోరాటాలకు తలోగ్గిన రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ల ప్రకారంగా వర్గీకరణ న్యాయ సమ్మతం తేల్చి చెప్పినప్పటికీ కాలయాపన తో కల్లి బొల్లి మాటలతో కాలం వెళ్లదియాలని  రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని, ఇట్లాంటి చౌక బారు వేషాలు  మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.