వాటికి మించి వినోదం

Fun beyond that‘భూల్‌ భూలయ్యా 3’ టైటిల్‌ ట్రాక్‌ లాంచ్‌ ప్రమోషనల్‌ టూర్‌లో భాగంగా కార్తీక్‌ ఆర్యన్‌, విద్యాబాలన్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు. ఇప్పటికే ఈచిత్ర ట్రైలర్‌ అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో రిలీజైన టైటిల్‌ ట్రాక్‌ కూడా ట్రైలర్‌కి మించిన స్థాయిలో విశేష ఆదరణ పొందుతోంది. మిస్టర్‌ వరల్డ్‌వైడ్‌గా పిలువబడే పిట్‌బుల్‌, గ్లోబల్‌ పంజాబీ సంచలనం దిల్జిత్‌ దోసాంజ్‌ ఈ టైటిల్‌ ట్రాక్‌ను అత్యద్భుతంగా పాడారు. టైటిల్‌ ట్రాక్‌ ఫీవర్‌ను దేశంలోని వివిధ మూలలకు తీసుకెళ్ళడం కోసం కార్తీక్‌ ఆర్యన్‌ నగర పర్యటనను ప్రారంభించాడు. ఆ పర్యటన ప్రస్తుతం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ టైటిల్‌ ట్రాక్‌ ప్రతి ఒక్కరినీ మ్యాజిక్‌లో ఉంచి, సినిమా విడుదల కోసం ఉత్సాహాన్ని నింపింది. బ్లాక్‌బస్టర్‌ ‘భూల్‌ భూలయ్యా 2’ నుండి రూహ్‌ బాబా పాత్రను కార్తీక్‌ ఆర్యన్‌ తిరిగి పోషించారు. త్రిప్తి దిమ్రీ, మంజులిక, విద్యాబాలన్‌ , మాధురీ దీక్షిత్‌లతో కలిసి కార్తీక్‌ ఆర్యన్‌ కనిపిస్తాడు. బాజ్మీ దర్శకత్వం వహించారు భూషణ్‌ కుమార్‌ ప్రారంభించిన ఈ హర్రర్‌ కామెడీ ఫ్రాంచైజీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సినిమా వారధిగా పని చేయనుంది. భయపడుతూనే నవ్వుకునేందుకు ఈ దీపావళికిగా సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్‌ తెలిపారు. దీపావళి కానుకగా నవంబర్‌ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలోని హర్రర్‌, కామెడీ, థ్రిల్‌..ఇలా ప్రతీదీ గత చిత్రాలకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీన్ని కుటుంబ సమేతంగా చూస్తే మరింత మజాగా ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్రతోపాటు ఇతర పాత్రలు చేసే మ్యాజిక్‌ మిమ్మల్ని తప్పకుండా మెప్పిస్తుంది. అంతేకాదు ఎంతగా భయపడతారో అంతకంటే ఎక్కువగా నవ్వుతారు. ఆ నవ్వులకు సిద్ధంగా ఉండండి.
– హీరోయిన్‌ విద్యాబాలన్‌
ఈ చిత్ర కథ చాలా కొత్తగా, గత రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. దీంట్లో నా పాత్ర ఎలా ఉంటుంది?, ఈసారి ఏం చేయనుంది అనేది తెలియాలంటే దీపావళి గిఫ్ట్‌గా థియేటర్లలోకి వస్తున్న మా సినిమా చూడాల్సిందే. మీరు కచ్చితంగా సరికొత్త అనుభూతికి లోనవుతారు.
– హీరో కార్తీక్‌ ఆర్యన్‌