ఆహ్లాదం..ఆనందం  పాఠశాల

Fun..fun school– జెడ్పిహెచ్ ఎస్ పెద్దవూర మండల కేంద్రం లో పరిమిలిస్తున్న పచ్చందం
– తల్లిదండ్రులు, గ్రామస్థుల ఆనందం
– స్వచ్చదనం – పచ్చదనం” పట్ల మరింత అవగాహన
నవతెలంగాణ – పెద్దవూర
ఈ పాఠశాలలో ఎటువైపు చూసినా పచ్చని హరివిల్లు స్వాగతం పలుకుతోంది. అంతేకాదు ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే ప్రకృతి సోయగం అలరిస్తోంది. ఇంతటి పచ్చని హరివిల్లు సోయగం ఉన్న స్కూల్ ఉండేది ఎక్కడో కాదు పెద్దవూర మండల కేంద్రం లోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నిండు పచ్చదనంతో పాఠశాల ఆవరణ విద్యార్థులను ఇట్టే ఆకర్షిస్తోంది. పాఠశాలలో మొక్కల పెంపకం పై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, ఉపాధ్యాయులు విద్యార్థుల చేత మొక్కలు నాటించే కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారు. ఆ మొక్కలు ఏపుగా పెరిగి పెద్ద చెట్లు గా మారి నీడ నిస్తున్నాయి. పాఠశాలలో ఎటు చూసినా ప్రకృతి పులకరిస్తోంది. ఈ పాఠశాల ప్రవేశ ద్వారం నుంచి చిన్న చిన్న మొక్కలు స్వాగతం – సుస్వాగతం అంటూ పలరిస్తాయి. ఈ స్కూల్ లో విద్యార్థకు ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.పాఠశాలలో మొక్కల సంరక్షణకై అనునిత్యం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇక్కడ కృషి చేయడం విశేషం. ఈ పాఠశాల లో 550 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.ఇంతటి నిండు పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉన్న పాఠశాలలో నేటి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని కూడా గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు. ఇప్పటికే పాఠశాల లో 200 లు పైగా చెట్లు ఉండగా అందులో 100 చెట్లు నీడనిచ్చే వృక్షాలతో పాఠశాల ప్రాంగణం చల్లని నీడతో అహలాదంగా వుంది.జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మెన్ ర్నాటి లింగారెడ్డి గత కొద్ది రోజుల క్రితం పాల్గొని విద్యార్థుల కృషిని అభినందించారు. కాలుష్య నివారణకు మొక్కల పెంపకం ఎంతో దోహదం చేస్తున్నారు.పాఠశాల భవిష్యత్తు కోసం విద్యార్థులు విధిగా విరివిరిగా మొక్కలు నాటారు.