చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎం.ఎస్. రామ్‌కుమార్ నిర్మిస్తున్నారు. సాయి కిషోర్ మచ్చా దర్శకుడు. గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ఇది. ట్రైలర్ ఆకట్టుకుంది. ఇండిస్టీలోని 80% ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. ప్రొడ్యూసర్ రామ్ కుమార్, డైరెక్టర్ సాయి కిషోర్ చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి. సినిమాకు మంచి రెవెన్యూ రావాలి’ అని తెలిపారు. భూపతి ఫ్యామిలీలో కాబోయో అల్లుడిగా ఎన్‌ఆర్‌ఐ వెన్నెల కిషోర్ అడుగుపెట్టడంతో ట్రైలర్ బిగిన్ అయ్యింది. ఆయన కజిన్‌గా హీరో చేతన్ అరంగేట్రం చేస్తాడు. పెళ్లి ఇంట హీరోతో పాటు వెన్నెల కిషోర్ చేసిన హంగామా కావాల్సినంత ఫన్ క్రియేట్ చేసింది. ఫారిన్‌లో ఉన్నప్పుడే అతనికి హీరోయిన్‌తో లవ్ స్టోరీ ఉంటుంది. హీరో ప్రేమకథకు, అతను ఈ ఊరికి రావడానికి సంబంధం ఏంటి?, తండ్రిని ప్రాణంగా ప్రేమించే కొడుకుగా హీరో ఆయన కోసం ఏం చేశాడు? అనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. గోపీసుందర్ కంపోజ్ చేసిన మూడు ఛాట్‌బస్టర్ సాంగ్స్ ట్రైలర్‌కు ఆకర్షణగా నిలిచాయి. ఎంటర్‌టైన్‌మెంట్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, సూపర్ హిట్ మ్యూజిక్‌తో సాగిన ట్రైలర్ థియేటర్‌లో సినిమా చూసేందుకు కావాల్సినంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అని చిత్ర యూనిట్ తెలిపింది.