వెంకటేష్ చాలా సినిమాల్లో పోలీసు పాత్రలు పోషించినప్పటికీ ఆయన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’లో క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలోని మేజర్ పార్ట్ ఎక్స్ పోలీసుగా, ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించనున్నారు’ అని మేకర్స్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. శుక్రవారం వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సెకండ్ సింగిల్- ‘మీను..’ ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రోమోలో వెంకటేష్ తన ఎక్స్ లవర్ మీను (మీనాక్షి చౌదరి)ని సరదాగా ఆటపట్టిస్తూ, అతని భార్యతో (ఐశ్వర్య రాజేష్) కూడా ఉల్లాసంగా ఉండే ఇంటి వేడుకను ప్రజెంట్ చేసింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తుండగా, మీనాక్షి ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో కనిపించారు. స్టైలిష్ కాప్‌గా వెంకటేష్ అద్భుతమైన ట్రాన్స్ ఫర్మేషన్ ప్రోమోలో వండర్ ఫుల్ మూమెంట్. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా అందరినీ ఆద్యంతం నవ్విస్తుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.