ఆద్యంతం వినోదభరితం

Fun throughoutసన్‌ స్టూడియో బ్యానర్‌ పై శ్రీనిధి క్రియేషన్స్‌ సమర్పణలో నిర్మిస్తున్న తాజా చిత్రం ‘జంధ్యాల గారి జాతర 2.0′. శుక్రవారం ఈ సినిమా అతిరథమహారధులు సమక్షంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పృథ్వీ, హీరో, హీరోయిన్‌పై తొలిషాట్‌ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ,’ఈ సినిమా ఫుల్‌ లెన్త్‌ కామెడీ చిత్రంగా తెలుగు పరిశ్రమలో ఒక ముద్ర వేసుకుంటుంది. నా కూతురు శ్రీలు కూడా ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ‘ఈ సినిమాకి జంధ్యాల పేరు పెట్టడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడతాయి. అయితే ఆ అంచనాలను ఈ సినిమా కచ్చితంగా అందుకుంటుంది’ అని దర్శకుడు వాల్మీకి చెప్పారు. హీరో క్రిష్‌ సిద్దిపల్లి మాట్లాడుతూ, ‘సినిమా ఆద్యంతం హాస్య భరితంగా ఉంటుంది. ప్రేక్షకులకు విందు భోజనం లాంటి సినిమా ఇది’ అని తెలిపారు. క్రిష్‌ సిద్ధిపల్లి, కాష్వీ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, పోసాని కష్ణ మురళి, సత్య, అజరు గోష్‌, రాజీవ్‌ కనకాల, రఘుబాబు, ప్రిన్స్‌, నాగినీడు, పవిత్ర నరేష్‌, పూర్ణ, సురేఖ వాణి, దువ్వాసి మోహన్‌ తదితరులు నటిస్తున్నారు.