సీఎం సహా నిధి చెక్కు పంపిణి..

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల లింగంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయంగా 62500 రూపాయలను ఎంపీపీ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా అందించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఏదైనా ప్రమాదవశాత్తూ ఆస్పత్రికి పాలైన పేద మధ్య తరగతి కుటుంబాల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు విడుదల చేసి ఆర్థికంగా అదుకుంటునట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కండరావ్ పటేల్,హనుమంత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.