కుల మత బేధం లేకుండా అన్ని సంఘాలకు నిధులు

– నిజామాబాద్ నగరం లో ప్రతి కుల సంఘం నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసాము
– ముఖ్యమంత్రి కేసీఆర్ హయం లో కుల మతాలకు గౌరవం
– అభివృద్ధి చేసాము -ఆదరించండి
– నిజాంబాద్ పట్టణ పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత అర్బన్ ఎమ్మెల్యే బీగాల
నవతెలంగాణ- కంటేశ్వర్
కులమత బేధం లేకుండా అన్ని సంఘాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని నిజామాబాద్ నగరంలో ప్రతి కుల సంఘం నిర్మాణాలు చేపట్టడం కోసం ప్రత్యేక నిధులను సైతం మంజూరు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలో కులమతాలకు గౌరవం దక్కిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదరించండి నిజామాబాద్ పట్టణ పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే విగల గణేష్ గుప్తా అన్నారు.ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఎమ్మెల్యే గణేష్ బిగాల విజయ లక్ష్మి గార్డెన్స్ లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు.నిజామాబాద్ నగరం లోని 51 పద్మశాలి సంఘాలకు 2 కోట్ల 55 లక్షల రూ.ల సి.డి.పి. నిధులను కేటాయించి ప్రొసీడింగ్ కాపీ లను పద్మశాలి సంఘ సబ్యులకు అందచేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..నిజామాబాద్ నగరంలో కుల ,మతాలకు అతీతంగా భవనాలు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేసాము.పద్మశాలి కుల సంఘానికి కవితక్క నేను 51 సంఘాలకు రెండు సార్లు 5 కోట్ల రూ.నిధులు మంజూరు చేసాము.
రెండు సార్లు నగరం లోని 51 పద్మశాలి తర్పలకు భవనాలు నిర్మించుట కొరకు 5 కోట్ల రూ.లు సిటే.డి.పి. నిధులు మంజూరు చేసాము. రాజకీయంగా పద్మశాలి సోదరులకు 3 కార్పొరేటర్ టికెట్ లు ఇచ్చాము.కంటేశ్వర్ ఆలయం చైర్మన్ గా బిళ్ళ మహేష్ పద్మశాలి ని నీయమించాము. ఆలయ ధర్మకర్తలుగా బి ఆర్ ఎస్ పార్టీ లో పద్మశాలి లకు అవకాశం కల్పించాము.ఒక వైపు పద్మశాలి లకు కుల సంఘాలకు నిధులు ఇస్తూ మరో వైపు అవకాశం ఉన్న ప్రతి కమిటీ లో పద్మశాలి సోదర సోదరీమణులు అవకాశం కల్పించాము.మిమ్మల్ని ఆదరించి పద్మశాలి లను కడుపు లో పెట్టుకొని చేసుకున్నాము. మీరు అభివృద్ధి చూసి బి.ఆర్.ఎస్ పార్టీకి ఓటు వేయండి.కుల సంఘాలకు నిధులు ఇవ్వడమే కాకుండా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకువెళ్తున్నాము. ఆధునిక సదుపాయాలతో వైకుంఠ దామలు,సులభతరమైన పాలన కోసం మునిసిపల్ కార్యాలయాన్ని నిర్మించాము.అభివృద్ధి చేసాము, పని చేసే వారికి పట్టం కట్టండి.బి.ఆర్.ఎస్ పార్టీని ఎమ్మెల్యే, ఎమ్.పి.ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ ,పద్మశాలి సంఘం నాయకులు యాదగిరి,గుజ్జెటి వెంకట నర్సయ్య,యెనుగందుల మురళి,బిళ్ళ మహేష్, సిరిగాధ ధర్మపురి, ఎస్ ఆర్ సత్యపాల్,కస్తూరి గంగరాజు, శివ లింగం,శంకర్,కార్పొరేటర్ ఆకుల హేమలత  బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.