నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయాంజల్ మున్సిపాలిటీ కోహెడలో ఉన్న పండ్ల మార్కెట్‌కు తొలి విడతగా రూ. 350 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు మండల రైతు బంధు కో ఆర్డినేటర్ కందాల బలదేవ రెడ్డి తెలిపారు. కోహెడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పండ్ల మార్కెట్ అభివృద్ధితో ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని పేర్కొన్నారు. అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో సామ శ్రీనివాస్ రెడ్డి, బిందు రంగారెడ్డి, పల్లపు ఆంజనేయులు, జులు మల్లేష్, ఎన్. రమేష్, బూర రమేష్, పల్లపు యాదగిరి, శివ శంకర గౌడ్ పాల్గొన్నారు.