బడ్జెట్లో విద్యా రంగానికి  నిధులను కేటాయించాలి

– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు
నవతెలంగాణ-బొమ్మలరామారం : భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI )ఎస్ఎఫ్ఐ బొమ్మలరామారం మండల  కమిటీ సమావేశం గురువారం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి వనం రాజు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్య రంగానికి 30 శాతం నిధులను కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలకు జనరల్ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని , వాన వస్తే వలవల గాలొస్తే గలగల అన్నట్లు ఉన్న గురుకుల హాస్టల్ ఉన్నాయని, బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి, గ్రామంలో ఉన్న గురుకులాల్లో సొంత భవనం నిర్మించాలని ,అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు వాష్రూమ్లో ఏర్పాటు చేయాలని, అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వం విద్యారంగానికి తీర్ల నిర్లక్ష్యం వహించింది ఈ కొత్త ప్రభుత్వం లో కూడా విద్యారంగానికి అధిగనిధులు కేటాయించాలని,బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని యడెల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి లావుడియ రాజు ,నాయకులు,అఖిల్,శివరాం,ప్రబాష్,గణేష్,గిరి,రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.