నవ్వించే జాతకాల పిచ్చోడి కథ

Funny Horoscope Madness Storyమోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్‌ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్‌’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్‌ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్‌ 20న సినిమా విడుదల చేయనున్నారు. గురువారం హీరో విజరు దేవరకొండ చేతుల మీదుగా టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నా బ్రదర్‌ దర్శి (ప్రియదర్శి)తో నా కెరీర్‌ స్టార్ట్‌ చేశా. ఇంట్రెస్టింగ్‌ కథల్లో లీడ్‌ రోల్స్‌ చేస్తూ మనకు మంచి సినిమాలు అందిస్తున్నాడు. టీజర్‌ చూశాను. ఇందులో… దర్శి పాత్రకు జాతకాల మీద నమ్మకం ఉంటుంది. జాతకాలు ఎంత నిజం అనేది నాకు తెలియదు. ‘పెళ్లి చూపులు’ చేసినప్పుడు మేం ఈ స్థాయికి వస్తాం అని ఊహించలేదు. డెస్టినీ మమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చింది. మోహనకృష్ణ ఇంద్రగంటి తీసిన ‘అష్టా చమ్మా’ సినిమా చూసి బాగా నవ్వుకున్నాను. అలాగే శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.