– వాయిదా వేసిన అలహాబాద్ హైకోర్టు బెంచ్
– ‘జ్ఞానవాపి బేస్మెంట్లో పూజల’పై సాగుతున్న వాదనలు
లక్నో: జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ బేస్మెంట్లో పూజకు అనుమతించటంపై దాఖలైన పిటిషన్ విచారణ అలహాబాద్ హైకోర్టులో కొనసాగుతున్నది. బేస్మెంట్లో పూజకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు గతనెల 31న ఆదేశాలను జారీ చేసిన విషయం విదితమే. అయితే, కోర్టు ఆదేశాలపై అంజుమాన్ ఇంతెజామియా మజీద్ కమిటీ అభ్యంతరం తెలిపింది. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్నోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అలహాబాద్ హైకోర్టులో మజీద్ కమిటీ పిటిషన్ను దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ బెంచ్ విచారణ జరిపింది. వాదనలను విన్నది. దీనిపై ఎలాంటి తుది ఆదేశాలను మాత్రం జారీ చేయనప్పటికీ.. తదుపరి విచారణను మాత్రం ఈనెల 12కు వాయిదా వేసింది.