నవతెలంగాణ-హైదరాబాద్: భారతదేశంలో శానిటరీ వేరీ బ్రాండ్ లో అగ్రగామి సంస్థ అనగానే అందరికి గుర్తుకువచ్చేది హింద్ వేర్. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులతో వినియోగదారులకు దగ్గరైన హింద్ వేర్.. ఇవాళ వాటర్ మేనేజ్‌మెంట్ & ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్ (WMPSC)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్లంబర్లలో వృత్తి నైపుణ్యాన్ని మరింతగా పెంచేందుకు కృషి చేస్తుంది. దీనివల్ల రాబోయే రెండేళ్లలో భారతదేశం మొత్తం సుమారు 5 వేల మంది ప్లంబర్లకు నైపుణ్యం పెంచి మరిన్ని అద్బుతమైన అవకాశాలు అందేలా వారిని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు మరియు జీవనోపాధిని మరింత మెరుగు అవుతుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్లంబర్ల కోసం వ్యవస్థాపక అవకాశాలను పెంపొందించడం కోసం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. దేశీయ ప్లంబింగ్ అవసరాలను తీర్చడంలో భారతదేశంలోని ప్లంబింగ్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మన దేశంలో ప్లంబింగ్ అవసరాలకు కావాల్సిన మిలియన్ ప్లంబర్ల మద్దతు ఉంది. అయితే, వీరిలో ఎక్కువమందికి అధికారిక శిక్షణ లేదు. దీనివల్ల వారి అభివృద్ధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ప్లంబర్లు మెరుగైన జీవనోపాధిని పొందే అవకాశాలను అందుకోలేకపోతున్నారు. ఇది పూర్తిగా అసంఘటిత రంగం. చాలా మంది ప్లంబర్లు కేవలం తాము నేర్చుకున్న పనిలోనే శిక్షణ లేదా ఏమాత్రం పరిచయం లేని సలహాదారుల నుండి పని నేర్చుకుంటున్నారు. తద్వారా వారు మెరుగైన పనితీరుని కనబర్చలేకపోతున్నారు. హింద్ వేర్ మరియు WMPSC మధ్య సహకారం ఈ సవాళ్లను పరిష్కరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పరిశ్రమలో అట్టడుగున ఉన్న కార్మికులకు నైపుణ్యం అందంచి వారి జీవనోపాధి అవకాశాలను మరింతగా పెంచడం ద్వారా ప్లంబర్ల సంఘాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. భారతదేశంలో ప్లంబింగ్ ప్రమాణాలను పెంపొందించడానికి హింద్ వేర్ బ్రాండ్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇందుకోసం మొత్తం ఈ కార్యక్రమానికి హింద్‌వేర్ నిధులు సమకూరుస్తుంది. ఇక ఈ శిక్షణ కార్యక్రమంలో ఆధునిక ప్లంబింగ్ పద్ధతులు, పారిశుద్ధ్య పద్ధతులు, కస్టమర్ సేవ మరియు భద్రతా ప్రోటోకాల్‌లతో సహా అనేక రకాల అంశాలను కవర్ చేస్తారు. ఇందులో పాల్గొనేవారు ప్లంబింగ్ టెక్నాలజీ, స్థిరమైన ప్లంబింగ్ పద్ధతుల గురించి లేటెస్ట్ అప్ డేట్స్ పొందుతారు. తద్వారా వారంతా ఈ రంగంలో అద్భుతమైన నైపుణ్యాన్ని పొందుతారు. ఈ ట్రైనింగ్ సెషన్ లు 100 నగరాల్లో నిర్వహిస్తారు. దీనిద్వారా ఎక్కువమందికి అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించారు. బ్యాచ్ లుగా శిక్షణ ఇస్తారు. ఒక్కో బ్యాచ్ లో 40 నుండి 60 ప్లంబర్లు ఉంటారు. ఇంటరాక్టివ్ మరియు కండక్టివ్ వాతావరణంలో శిక్షణను అందిస్తారు.
ఈ సందర్భంగా భాగస్వామ్యం గురించి సీఈఓ బాత్ అండ్ టైల్స్, హింద్ వేర్ లిమిటెడ్ శ్రీ సుధాన్షు పోఖ్రియాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో ప్లంబింగ్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ కొరత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలా మంది ప్లంబర్లకు అధికారిక శిక్షణ మరియు విద్య అందుబాటులో లేదు. ఇప్పుడు WMPSCతో భాగస్వామ్యం ద్వారా అత్యుత్తమ శిక్షణను అందిస్తారు. తద్వారా శిక్షణ పొందిన ప్లంబర్లు మెరుగైన జీవనోపాధిని పొందగలుగుతారు. అంతేకాకుండా వారి జీవన ప్రమాణాలను కూడా మరింతగా పెంచుకోగలుగుతారు. నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి కేంద్రంగా భారతదేశాన్ని మార్చాలన్న WMPSC ప్రయత్నాలకు మేము అభినందనలు తెలియజేస్తున్నాము. మెరుగైన ఉపాధి మరియు ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ప్లంబర్లకు సమానమైన అద్భుతమైన అవకాశాలను సృష్టించడంలో ఈ భాగస్వామ్యం అద్భుతంగా పని చేస్తుందని మేం ఆశిస్తున్నాం అనని అన్నారు.
ఈ సందర్భంగా WMPSC సీఈఓ కల్నల్ ఏకే చందేల్ మాట్లాడుతూ… “ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. అందువల్ల భారతదేశంలోని నైపుణ్యం కలిగిన మరియు నైపుణ్యం లేని ప్లంబింగ్ వర్క్ ఫోర్స్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. హింద్ వేర్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌తో భాగస్వామ్యం కావడం పట్ల మాకు సంతోషంగా ఉంది. ప్లంబర్‌లలో నైపుణ్యం పెంచడం మరియు అందుకు సంబంధించిన విద్యను అందించడం ద్వారా ఉమ్మడి లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాం. దీనిద్వారా మా ఈ ప్రయత్నాలు సహాయపడతాయని మేము భావిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ స్కిల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా, నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కల్పనపై దృష్టి సారించింది. వాటర్ మేనేజ్‌మెంట్ & ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్ (WMPSC) సహకారంతో రాబోయే రెండేళ్లలో 5 వేల మంది ప్లంబర్లను వృత్తి నిపుణులుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ ను రూపొందించడానికి చేస్తున్న ప్రయత్నాలకు హింద్‌వేర్ కూడా తన సహాయసహకారాలను అందిస్తోంది.