నవతెలంగాణ – హైదరాబాద్ : ఫోన్‌పే ఉత్పత్తి అయిన షేర్.మార్కెట్ తన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) విభాగాన్ని ప్రారంభించినట్లు ఈరోజు ప్రకటించింది. ఇంటెలిజెన్స్ లేయర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, మెరుగైన ట్రేడింగ్ అనుభవాన్ని సులభతరం చేసే కాంప్రెహెన్సివ్ ట్రేడింగ్ టూల్స్, రిసోర్స్‌లను ఇది ఉపయోగిస్తుంది. ఈ నూతన విభాగం ట్రేడర్లకు సాధికారిత కల్పించాలన్న ప్లాట్‌ఫామ్ మిషన్‌లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచిపోనుంది. వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించిన ఏడు నెలల్లోపే 1.55 మిలియన్ల మంది లైఫ్‌టైమ్ కస్టమర్లను షేర్.మార్కెట్ సంపాదించుకుంది. వీరి ద్వారా ప్రతినెలా 1.4 మిలియన్లకు పైగా MF SIP లావాదేవీలు చురుగ్గా సాగుతున్నాయి. దీంతోపాటు షేర్.మార్కెట్‌లో 1.5 లక్షల డీమాట్ అకౌంట్లు ఉండగా, 75,000+ యూజర్లకు (డైలీ యాప్ ఎంగేజ్‌మెంట్) ఇంటెలిజెన్స్ యాక్సెస్‌ను షేర్.మార్కెట్ అందిస్తోంది. షేర్.మార్కెట్‌లో F&O (ఫ్యూచర్స్ & ఆప్షన్స్) సామర్థ్యాలను ప్రవేశపెట్టడం వల్ల ప్లాట్‌ఫామ్ అందించే సౌకర్యాలు మెరుగవుతాయి. ఆప్షన్లను ట్రాక్ చేయడం కోసం కాంప్రెహెన్సివ్ ఆప్షన్ పరంపరను విశ్లేషించే అవకాశమున్నందున మరింత సౌకర్యవంతమవుతుంది. వివిధ సూచీలు, స్టాక్‌లతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులను కుదుర్చుకుంటుంది. ఇది ట్రేడర్ ప్రయాణంలో రిస్క్, పరిస్థితి దిగజారకుండా చూసుకోవడం, అలాగే సమర్థవంతమైన పోర్ట్‌ఫోలియో నిర్వహణతో మొత్తం రిటర్న్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడంలో కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే మరింత ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం కోసం, గ్రీక్స్ చుట్టూ ట్రేడర్ ఫోకస్ చేసిన డేటా పాయింట్లు, అలానే సమర్థవంతమైన మనీ మేనేజ్‌మెంట్ వ్యూహం రూపకల్పనను త్వరలోనే తీసుకొస్తుంది.
F&O సదుపాయంలో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు:
– శక్తివంతమైన ట్రేడింగ్ ఇంటర్‌ఫేస్: దీనిలో ట్రేడింగ్ ప్రాసెస్‌ను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ ఉంది, ఇది F&O ట్రేడ్‌లను ట్రేడర్లు సులభంగా, సమర్థవంతంగా చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఆర్డర్లను ట్రాక్ చేయడానికి, నిర్వహించడానికి సంబంధించిన ప్రభావవంతమైన రిస్క్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలలో తగిన మూలధన కేటాయింపు, సకాలంలో నిష్క్రమించే సౌకర్యం కూడా ఉంటాయి.
– ఎవాల్వింగ్ ఇంటెలిజెన్స్ లేయర్: మ్యాక్స్ పెయిన్, పుట్ కాల్ రేషియో (PCR)తో పాటు, ఓపెన్ ఇంట్రెస్ట్ (OI)లో జరిగే మార్పును సులభంగా ఊహించగలగడం వంటి ఫీచర్లు గల మెరుగైన ఆప్షన్ చెయిన్‌తో పాటు, వ్యక్తిగతమైన ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఇన్‌స్ట్రుమెంట్‌ల సామర్థ్యాన్ని అంచనా వేయగలిగే సౌకర్యం ప్రారంభమైంది. వ్యూహాన్ని అమలు చేయడానికి, దాన్ని నిర్వహించడానికి ఉపయోగపడే మరెన్నో ఫీచర్లు – ఉదాహరణకు హెడ్జింగ్, వ్యూహం ఎంపికలో మెకానిక్స్ వంటివే కాక మరెన్నో ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి
– మార్జిన్ ట్రేడింగ్ కోసం తాకట్టు పెట్టడం: అనుభవజ్ఞులైన వ్యాపారులు, ఇది వరకే ఉన్న తమ వాటాలను తాకట్టు పెట్టి, పూచీకత్తు మార్జిన్‌ను పొందే అవకాశం ఉంది.
విజ్ఞాన వనరులు: ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఇంటెలిజెన్స్ లేయర్‌తో పాటు, విజ్ఞాన వనరులు, ట్యుటోరియల్‌లు, వెబినార్‌లను యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని ట్రేడర్లకు ఇవ్వడం ద్వారా F&O ట్రేడింగ్ వ్యూహాలు, కాన్సెప్ట్‌లపై వారికి ఉన్న అవగాహనను మరింతగా పెంచడంలో సహాయపడుతుంది. F&O ప్రారంభం సందర్భంగా షేర్.మార్కెట్ CEO ఉజ్వల్ జైన్ మాట్లాడుతూ, “పెట్టుబడిదారులు, ట్రేడర్లు పెట్టుబడితో తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నట్లుగానే, ఇంటెలిజెన్స్ సహకారంతో డిస్కౌంట్ బ్రోకింగ్‌ను మెరుగుపరచడం కోసం షేర్.మార్కెట్ ప్రతిష్టాత్మకమైన చర్యలను తీసుకుంది.” అని చెప్పారు, అంతేగాక “మా ప్లాట్‌ఫామ్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ప్రారంభించడం ద్వారా మేము అందిస్తున్న సౌకర్యాలను మరింత విస్తరించాము. దీన్ని తీసుకురావడం వల్ల పెట్టుబడిదారులు, ట్రేడర్లు నేటి డైనమిక్ ఫైనాన్షియల్ మార్కెట్‌లలో నావిగేట్ చేయడానికి అవసరమైన ఇన్‌స్ట్రుమెంట్‌లు, రిసోర్స్‌లను మెరుగుపర్చడం కోసం మేము చేస్తున్న ప్రయత్నాలకు మరింత బలం చేకూరుతుంది.” అని తెలిపారు. కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, వారి కోసం వినూత్న ఆవిష్కరణలను తీసుకురావాలనే షేర్.మార్కెట్ అంకితభావానికి ఈ F&O ఫీచర్ నిదర్శనం. కొత్త ఫీచర్లు, సామర్థ్యాలతో తన ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం మెరుగుపరుస్తూ, పెట్టుబడి పరిశ్రమలో షేర్.మార్కెట్ ముందంజలో నిలిచింది. అంతేగాక నిరంతరం కొత్తగా పుట్టుకొస్తున్న పెట్టుబడిదారులు, ట్రేడర్ల అవసరాలను తీరుస్తోంది.
షేర్. మార్కెట్ 2023, ఆగస్టు చివరి వారంలో ప్రారంభమైంది, ఇది మార్కెట్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ రీసెర్చ్-ఆధారిత వెల్త్‌బాస్కెట్‌లను అందిస్తూ, డిస్కౌంట్ బ్రోకింగ్‌ను పెంచుతుంది, ఇది స్కేలబుల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, అలాగే పెట్టుబడిదారులు, వ్యాపారులు అనే తేడా లేకుండా అందరికీ ఒకేలా గొప్ప కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. వివిధ వర్గాలకు చెందిన వారికి అన్ని అంశాలను సంపూర్ణంగా, సమన్వయం చేసే పోర్టిఫోలియోను రూపొందించే అవకాశాన్ని కల్పిస్తూ, విభిన్న శ్రేణులకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ ప్రోడక్ట్‌లను అందిస్తుంది. షేర్.మార్కెట్ స్టాక్‌లు (ఇన్‌ట్రాడే, డెలివరీ), మ్యూచువల్ ఫండ్‌లు, ఎక్స్‌ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌లు (ETFలు), ఇంకా వెల్త్‌బాస్కెట్‌లను అందిస్తుంది.
వెబ్‌సైట్: https://share.market
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: https://apps.apple.com/in/app/
ఫోన్‌పే వెల్త్ బ్రోకింగ్ గురించి పరిచయం: ఫోన్‌పే వెల్త్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏప్రిల్ 2021లో చట్టబద్ధమైన సంస్థగా ఏర్పడింది, ఇది ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ, అలాగే NSE, BSEలలో స్టాక్ బ్రోకర్‌గా రిజిస్టర్ అయింది. CDSLతో డిపాజిటరీ పార్టిసిపెంట్‌గా, SEBIతో రీసెర్చ్ అనలిస్ట్‌గా, అలాగే AMFIతో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా రిజిస్టర్ అయింది. షేర్.మార్కెట్ ఆగస్ట్ 2023లో ప్రారంభమైంది, ఇది ఫోన్‌పే వెల్త్ బ్రోకింగ్ బ్రాండ్, అలాగే దాని అనుబంధ సంస్థ. ఇది వెల్త్ & ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ (యాప్ & వెబ్‌సైట్), అన్ని నైపుణ్య స్థాయిలలోని పెట్టుబడిదారులు, వ్యాపారులకు సర్వీసులు అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, వెల్త్‌బాస్కెట్‌లు, ఇంకా మరిన్ని ఉత్పత్తులతో సహా అనేక రకాల పెట్టుబడి ఉత్పత్తులతో అందిస్తుంది.
ఫోన్‌పే గ్రూప్ గురించి పరిచయం: ఫోన్‌పే గ్రూప్ భారతదేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ. దీని ప్రధాన ఉత్పత్తి అయిన ఫోన్‌పే డిజిటల్ పేమెంట్ల యాప్‌ను ఆగస్ట్ 2016లో ఆవిష్కరించింది. కేవలం 7 సంవత్సరాలలోనే, 52+ కోట్ల రిజిస్టర్ చేసుకున్న యూజర్లు, ఈ యాప్‌ను ఉపయోగించి డిజిటల్ పేమెంట్‌లను స్వీకరిస్తున్న 3.8 కోట్ల మర్చంట్ల నెట్‌వర్క్‌తో భారతదేశపు ప్రముఖ యూజర్ పేమెంట్ల యాప్‌గా ఈ కంపెనీ అవతరించింది. ఫోన్‌పే వార్షిక మొత్తం పేమెంట్ విలువ (TPV) USD 1.5+ ట్రిలియన్(దాదాపుగా రూ. 125. 02 లక్షల కోట్లు)తో పాటు 23+ కోట్ల రోజువారీ లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. డిజిటల్ పేమెంట్లలో ఫోన్‌పే అగ్రగామిగా నిలిచిన నేపథ్యంలో, ఫోన్‌పే గ్రూప్ ఆర్థిక సేవలు (ఇన్సూరెన్స్, లెండింగ్, వెల్త్) అలాగే కొత్త యూజర్ టెక్ బిజినెస్ (పిన్‌కోడ్ – హైపర్‌లోకల్ ఈ-కామర్స్, అలానే ఇండస్ యాప్‌స్టోర్ – భారతదేశపు మొట్టమొదటి లోకలైజ్ చేసిన యాప్‌స్టోర్)లను విస్తరించింది. ఫోన్‌పే గ్రూప్ అనేది భారతదేశం కేంద్రంగా పనిచేసే టెక్ సంస్థ, ఇది ప్రతి భారతీయుడికి నగదు ప్రవాహాన్ని, సేవలకు యాక్సెస్ కల్పించి, వారి పురోగతిని వేగవంతం చేయడానికి, అలానే వారికి సమాన అవకాశాలను అందించాలనే కంపెనీ లక్ష్యంతో అనుసంధానమైన బిజినెస్‌ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.
మరిన్ని వివరాల కోసం, ఈ ఈమెయిల్‌కు మెయిల్ చేయండి: media@share.market ఈ ఆర్టికల్‌ను విజ్ఞానం, అవగాహన కల్పించడం కోసం మాత్రమే ప్రచురిస్తున్నాం, దీన్ని సిఫార్సుగా పరిగణించకూడదు. “సెక్యూరిటీస్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పత్రాలు అన్నింటినీ జాగ్రత్తగా చదవండి.” పెట్టుబడిదారులందరూ పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం తీసుకునే ముందు పెట్టుబడి వ్యూహాలపై స్వయంగా, స్వచ్ఛందంగా పరిశోధన చేయాలని వారికి మేము సూచిస్తున్నాము.
నిరాకరణ: ఫోన్‌పే వెల్త్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు NSE & BSEలో సభ్యత్వం ఉంది, అలాగే SEBIలో రిజిస్ట్రేషన్. నంబర్.: INZ000302639తో రిజిస్టర్ అయింది, దీని రిజిస్టర్ చేసిన ఆఫీస్ అడ్రస్: ఆఫీస్ – 2, ఫ్లోర్ 3, వింగ్ ఎ, బ్లాక్ ఎ, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, బెల్లందూర్ గ్రామం, వర్తుర్ హోబ్లీ, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు సౌత్, బెంగళూరు, కర్ణాటక – 560103, ఇది SEBI రిజిస్ట్రేషన్ నంబర్.:IN-DP-696-2022, రీసెర్చ్ అనలిస్ట్– INH000013387, అలాగే ARN- 187821. మెంబర్ ఐడి: BSE – 6756 NSE 90226తో CDSL డిపాజిటరీలో డిపాజిటరీ పార్టిసిపెంట్‌గా ఉంది. CIN U65990KA2021PTC146954 “SEBI మంజూరు చేసిన రిజిస్ట్రేషన్‌తో పాటు, NISM జారీ చేసిన సర్టిఫికేషన్ ఉన్నంత మాత్రాన ఇది మధ్యవర్తిగా మంచి పెర్ఫామెన్స్ ఇస్తుందనే గ్యారెంటీ లేదు, అలాగే పెట్టుబడిదారులకు పక్కాగా రాబడి వస్తుందనే హామీని ఏ రూపంలోనూ ఇవ్వదు.”