నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం హైద రాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీక రించనున్నారు. ఉదయం 8 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయంలో, ఆ తర్వాత పలు ఆలయాల్లో ఆయన పూజలు నిర్వహిచనున్నారు. 9:30 గంటలకు ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి, 10 గంటలకు అమరవీరుల స్థూపానికి నివాళ్లర్పిస్తారు. 11:45 నిమిషాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్య తలు స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.