సిఐగా జి రవీందర్ బాధ్యతల స్వీకరణ

నవతెలంగాణ – గోవిందరావుపేట
పసర పోలీస్ స్టేషన్ నూతన సిఐగా జి రవీందర్ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ స్టేషన్లో సీఐగా విధులు నిర్వర్తించిన శంకర్ ములుగు పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెల్లగా ఆస్థానంలో రవీందర్ చార్జి తీసుకోవడం జరిగింది. గతంలో ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తించిన రవీందర్ సిఐగా రావడం మండల ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఎస్సైగా మండలానికి సుపరిచితులైన రవీందర్ తనదైన అక్షయలిలో విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలను పొందాడు. మండలంలో గ్రామాలు ప్రజలు రాజకీయ నాయకులు ఎవరు ఏంటి పరిస్థితులు అనేది పూర్తిగా
అవగాహన కలిగిన రవీందర్ సిఐ గా రావడం శుభ పరిణామంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ మేరకు పలు రాజకీయ పార్టీల నాయకులు సీఐ రవీందర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సిఐ రవీందర్ కూడా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ను కలిసి మొక్కను బహుకరించి కృతజ్ఞతలు తెలిపారు.