తుర్కపల్లి మండల ప్రత్యేక అధికారిగా జి.సురేష్


నవతెలంగాణ తుర్కపల్లి: మండల పరిషత్ అధ్యక్షుల ఎంపీటీసీల పదవి కాలం నేటితో ముగియడంతో యాదాద్రి భువనగిరి జిల్లా డిఆర్డిఓ జి సురేష్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రజా సమస్యల పైన వారికి అందుబాటులో ఉంటూ నిరంతరం పురస్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి, మండల అధికారులు పాల్గొన్నారు .