సోషల్‌మీడియాలో అసత్యప్రచారాన్ని ఖండిస్తున్నాం : జీఏడీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సోషల్‌మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని జీఏడీ అధికారులు ఖండించారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎవరైనా ఇబ్బందుల పాలు చేసినా, అసభ్యకరంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా, ఉద్యోగి విధులకు అటంకం కలిగించినా, ఉద్యోగులపై చేయి చేసుకున్నా ఐపీసీ సెక్షన్ల కింద చర్య తీసుకోబడును’ అనే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్చరించినట్టు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జీఏడీ అధికారులు వివరణ ఇచ్చారు.