ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన: గాదరి కిషోర్ కుమార్

నవతెలంగాణ – నూతనకల్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిపాలన ప్రజాపాలన కాదని ఇది ప్రజా వ్యతిరేక పాలనని తుంగతుర్తి మాజీ శాసనసభ సభ్యులు గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్బందాలు, అరెస్ట్ లతో అరాచక పాలన చేస్తుండు అని విమర్శించారు.విద్యుత్ ఉత్పత్తి పెరిగిన 24 గంటల  కరంట్ అందించలేక పోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అని అన్నారు. ప్రస్తుత కరువు నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించే అవకాశం ఉన్న  కూడా పట్టించుకోవడం లేదు అని పేర్కొన్నారు. రైతు భరోసా ఎకరానికి 15 వెయ్యిలు వరి పంటకు బోనస్ జాడలేదని విమర్శించారు. ఇప్పటికీ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి 17 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండు ఢిల్లీకి గులాంగిరి చేస్తుండు ఢిల్లీకి పోయి కప్పం కడుతుండు తెలంగాణ సొమ్మును ఢిల్లీకి దోచిపేడుతుండు అని ఆరోపించాడు నియోజకవర్గంలో తాను ప్రారంభించిన పనులే తప్ప ఒక్కటంటే ఒక్కటి కొత్త పని కానీ  కొత్త నిధులు కాని ప్రారంభించలేదని అన్నారు. మళ్లీ నియోజకవర్గ అభివృద్ధి కుంటూ పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షులు చూడి లింగారెడ్డినాయకులు బత్తుల సాయిల్ గౌడ్ బత్తుల విద్యాసాగర్, బిక్కి బుచ్చయ్య గౌడ్ గార్డు ల లింగరాజు మాజీ జెడ్పిటిసి నర్సింగ్ నాయక్ సురేందర్ నాయక్ మహేశ్వరం మల్లికార్జున్, బయ్య సంపత్ ఉప్పుల వీరు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.