నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ గ్రామానికి వెళ్లిన ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. రెం డు దఫాలు ఓడిపోయినప్పటికీ ప్రజాసేవే లక్ష్యంగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు గలమెత్తి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ప్రసాద్ కుమార్‌కు ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన తన జీవితం ప్రజాసేవకే అంకితం అని భావించిన ప్రసాద్‌కుమార్‌ను ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగా ణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ప్రజలకు తెలియపరుస్తూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఆమె రుణం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిందేమీ లేదన్న విషయాన్ని ప్రజలు పసిగట్టారని, జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరించి అధిక మెజారిటీ అందిస్తారని ప్రసాద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
వికారాబాద్ మున్సిపల్‌లో జోరుగా ప్రచారం
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 11వ వార్డు గెరిగేట్‌పల్లిలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షు లు అర్ధ సుధా కర్‌రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ కార్యక్రమంలో వికా రాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ గెరిగేట్‌పల్లి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి.. కాంగ్రెస్ నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మా జీ జడ్పీటీసీ ముక్తాహర్ షరీఫ్, కౌన్సిలర్లు చందర్‌నా యక్, మురళి, దేవి రెడ్యానాయక్, నాయకులు సామ ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.