అమ్మవార్లను దర్శించుకున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

అమ్మవార్లను దర్శించుకున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌నవతెలంగాణ-ములుగు
మేడారం జాతర సందర్భంగా శనివారం శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ వనదేవతలను దర్శించుకున్నారు. ముందుగా తులాభారం వద్ద స్పీకర్‌ తన 72కిలోల ఎత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకొని చీర, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించి తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పని చేసి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారని స్పీకర్‌ అభినందించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. స్పీకర్‌ వెంట పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, తదితరులు ఉన్నారు.