పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం

– కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం 
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ అత్యధిక మెజార్టీతో గెలుపు ఖాయమని మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,భూపాలపల్లి కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపే లక్ష్యంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలపై ప్రజలకు ప్రతి కార్యకర్త వివరించాలన్నారు.కేంద్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసే ఐదు గ్యారంటీలపై ఇంటింటా అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్,మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,పిఏసిఎస్ వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు, సింగిల్ విండో  డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,ఎంపిటిసి ప్రకాష్ రావు, జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి,యూత్ డివిజన్ నాయకుడు మండల రాహుల్, కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య,మల్కా మధుసూదన్ రావు, ఇందారపు చంద్రయ్య,కుంట సది, బండి స్వామి,జంగిడి సమ్మయ్య,మంథని రాజ సమ్మయ్య, రాగం రమేష్,రాజు నాయక్, తిర్రి సమ్మయ్య, అశోక్,బొబ్బిలి రాజు గౌడ్,ఇందారపు ప్రభాకర్,బూడిద రాజ సమ్మయ్య,పల్లెర్ల మదు,జనగామ బాపు,శనిగల శ్రావణ్,కోడారి చినమల్లయ్య,చంద్రగిరి అశోక్,మేనం సతీష్,శంకర్,మల్లారెడ్డి,ఆర్ని రాజబాబు,రావుల అంజయ్య,లింగన్నపేట రమేష్,రెవెళ్లి లింగయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,దుద్దిళ్ల అభిమానులు పాల్గొన్నారు.