గడ్డం వంశీకి ఓటువేసి ఆదరించాలి

Gaddam Vamsi should be voted and supported– జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, ఎంపిపి మలహల్ రావు
నవతెలంగాణ: మల్హర్ రావు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైనా తాడిచెర్లలో కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటువేసి ఆదరించాలని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఉపాది కూలీలను అభ్యర్దిoచారు.రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఈదుల,కోమటి కుంట తదితర చెరువుల్లో ఉపాది పనులు చేస్తున్న ఉపాది కూలీల వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకులు ఓట్లను అభ్యర్థిoచారు.ఈ సందర్భంగా మాట్లాడారు నాలుగు నెలల్లో ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,సబ్సిడీ వంట గ్యాస్ అందిస్తోందని,ఎన్నికలు పూర్తియ్యాక రైతు రుణ మాపి, రేషన్ లేనివారికి కొత్త రేషన్ కార్డులు,అర్హులైన వారికి ఆసరా పింఛన్లు అమలు చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రాజమ్మ,సింగిల్ విండో వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు,డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, డివిజన్ యూత్ నాయకుడు రాహుల్,యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి,మంథని రాజ సమ్మయ్య,కాంగ్రెస్ నాయకులు నేరేడుకొమ్మ రాజేశ్వర్ రావు,ఐత రాజిరెడ్డి, కేశారపు చెంద్రయ్య, బండి స్వామి,ఇందారపు చెంద్రయ్య, కుంట సది,జంగిడి సమ్మయ్య,రాగం రమేష్,రావుల అంజయ్య,రాజు నాయక్,బొబ్బిలి రాజు,ఆర్ని ఉదయ్,మేనం సతీష్,శ్రీనివాస్, మదు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.