– శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో మంథని నియోజకవర్గంనుండి అత్యధిక మెజార్టీతో గడ్డం వంశీ కృష్ణనీ గెలిపించాలని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 5 న్యాయ్ గ్యారంటీలను ప్రతి గడప గడపకు చేరవేయాలని, వంశీ కృష్ణ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. ఆదివారం సాయంత్రం కాటారం సబ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీను బాబు హాజరై మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కి మంథని నియోజకవర్గం నుండి లక్ష మెజార్టీ వచ్చే విధముగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని శ్రీను బాబు గారు దిశా నిర్దేశం చేసినారు.
10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీసింది. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన 6 గ్యారంటీలు విజయవంతంగా అమలు కావాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా ప్రభుత్వం ఏర్పాడల్సిన ఆవిష్కత ఉన్నదని, అందులో మన బాధ్యతగా గడ్డం వంశీ గారిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. శ్రీధర్ బాబు గెలుపుకు ఏ విధంగా పని చేసినారో అదేవిధంగాకృషి చేయాలని, వంశీకృష్ణ గెలుపుకు కూడా అదే విధముగా కష్టపడాలన్నారు, శ్రీధర్ బాబు నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారినీ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, ఆ నియోజకవర్గాల కంటే ఎక్కువ మంథని ప్రాంతం నుండి అత్యధిక మెజార్టీ రావడానికి ప్రతి యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థిలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. యువకుడు గడ్డం వంశీకృష్ణ గెలుపుకు నాంది కావాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,మల్హర్ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, యూత్ నాయకుడు రాహుల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, సింగల్ విండో చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.