పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి: గడ్డం వెంకటేష్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
యాదాద్రిభువనగిరి జిల్లా వ్యాప్తంగా అనేక పరిశ్రమలు ఉన్నాయని వాటిలో మాత్రం స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల నుంచి బీహార్,మధ్యప్రదేశ్,ఒరిస్సా,పశ్చిమ బెంగాల్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారికి తక్కువ వేతనాలకు ఎక్కువ పనులు చేయించు కుంటున్నారని,దీనివల్ల స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు లేక,ఉపాధి లేక గ్రామాలలో కుటుంబాలు గడవక అనేక ఇబ్బందులు పడుతున్నారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్,జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధు కృష్ణ అన్నారు.ఆదివారం మండలంలోని జై కేసారం గ్రామంలో యువజన సర్వే నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ యాదాద్రిభువనగిరి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా చౌటుప్పల్ మండల పరిధిలో అనేక పరిశ్రమలు ఉన్న స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం వల్ల స్థానిక యువత హైదరాబాద్,భువనగిరి ఇతర ప్రాంతాలకు వెళ్లి చాలీచాలని వేతనాలతో ఉదయం నుండి రాత్రి వరకు వెట్టిచాకిరి చేసి వస్తున్నారని వారు అన్నారు.స్థానికంగా ఉన్న పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా,చట్టం ప్రకారం స్థానిక యువతకు స్థానిక పరిశ్రమలలో 60 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉన్న ఏ ఒక్క పరిశ్రమ కూడా వాటిని అమలు చేయకుండా యదేచ్ఛగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పనిలో పెట్టుకుని స్థానిక యువతను మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పరిశ్రమలలో ఏదైనా ప్రమాదం జరిగినా బయటికి రాకుండా లోలోపలనే కుటుంబ సభ్యులతో కుమ్మక్కయి వ్యవహారాలు నడిపిస్తున్నారని వారు అన్నారు.అదేవిధంగా గ్రామాలలో పొల్యూషన్ విపరీతంగా ప్రవహిస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కనీసం స్పందించడం లేదని వారన్నారు. వీరితోపాటు మాజీ డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి బోదాస్ వెంకటేశం, డీవైఎఫ్ఐ నాయకులు బోదాస్ నరేష్,వనం విజయ్ కుమార్,పాలమాకుల రాకేష్,పొట్ట సుందర్,రాగీరు నవీన్,రుద్రోగోని మధు,తుపాకుల సాయి,డబ్బటి వంశీ,దొడ్డి శివ తదితరులు పాల్గొన్నారు.