ఎన్ఆర్ఐ ల మద్దత్తు కాంగ్రెస్ పార్టీకే: గడ్డంపల్లి రవీందర్ రెడ్డి

– నియోజకవర్గ అభివృద్దే ధేయంగా జానారెడ్డి కుటుంబం ప్రయత్నం
– మండుటెండలో ప్రచారం
నవతెలంగాణ – నాగార్జునసాగర్
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రంపై విదేశాలలోని ప్రవాసి భారతీయులు అత్యంత ఆసక్తి కనబర్చడమే కాకుండా తమకు వీలయిన విధంగా నియోజకవర్గానికి అభివృద్ధి చేసే నాయకుడి కోసం  ప్రత్యక్షంగా ప్రచార రంగంలో దిగుతున్నారు. మాతృభూమిపై మమకారంతో స్వదేశానికి వచ్చి నేరుగా ఎన్నికల ప్రచారంలో గడ్డంపల్లి రవీందర్ రెడ్డి మండుటెండలను సైతం లెక్కచేయకుండా తమ స్వస్థలాలలో తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయండంటూ ప్రచారం కొనసాగించారు.ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న వారిలో సింహభాగం పులిచెర్ల గ్రామానికి చెందిన గడ్డంపల్లి రవీందర్ రెడ్డి విదేశాలలో ఉన్న వ్యాపారాలకు తాత్కలిక విరామం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్  పక్షాన ప్రచారం చేస్తున్నారు.
ఈ రకమైన అంకితభావం కల్గిన ప్రవాసీయులు  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసి తెలంగాణ వాసులకు జూమ్  ద్వారా సందేశాన్ని అందించిన మాజీ సీ. ఎల్. పి లీడర్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ కుందూరు జానా రెడ్డి, తనయులు నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి , నల్గొండ పార్లిమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి , ఎన్. ఆర్. ఐ లు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, శ్రీను,నాగనబోయిన, మాధవ్ నెమలి.  ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసి తెలంగాణ వాసులను ఉద్దేశించి నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ  పార్లమెంట్ చట్టసభల్లో పంచవ్యాప్తంగా  విదేశాలలో ఉంటున్న ప్రవాసీయులు గల్ఫ్ కార్మికుల రక్షణ నూతన చట్టాలను తేవడం నది జలల విషయములో  విభజన హామీలను అమలు చేయించే ప్రయత్నము చేయడం జరుగుతుందని తెలిపారని అన్నారు.