గడ్డంకు శుభాకాంక్షలు తెలిపిన దండు

నవతెలంగాణ – మల్హర్ రావు
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన నేపధ్యంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ ఎన్నికల కౌoటీంగ్ కేంద్రం జెఎన్టీయూ కాలేజి వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.